News January 31, 2025
చౌటుప్పల్ బస్టాండ్ వద్ద గంజాయి స్వాధీనం

చౌటుప్పల్ బస్టాండ్లో యువకుడి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మన్మధ కుమార్ తెలిపారు. మర్రిగూడెం మండలం ఇందుర్తికి చెందిన సాయి కుమార్ చౌటుప్పల్ బస్టాండ్లో గంజాయి విక్రయించేందుకు వచ్చాడనే సమాచారంతో పట్టుకున్నట్లు తెలిపారు. అతణ్ని కోర్టులో హాజరు పరిచామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(ఫొటోలో) జననం
✒ 1995: హీరోయిన్ నివేదా థామస్ జననం
✒ 2000: ISSలో ఆస్ట్రోనాట్స్ నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం
News November 2, 2025
రామప్ప ట్రస్ట్ బోర్డు నియామకం కోసం ఎదురుచూపు?

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ శాఖ గత నెలలో దరఖాస్తులను స్వీకరించింది. అక్టోబర్ చివరి వారంలో బోర్డు నియామకం ఉంటుందని భావించినప్పటికీ ఆ దిశగా ఏర్పాట్లు జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా నామినేట్ పదవుల పంపిణీ జరుగుతుండటంతో నవంబర్ నెలలో ట్రస్ట్ బోర్డు నియామకం జరుగుతుందని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ నెలలోనైనా ఏర్పాటయ్యేనా? చూడాలి.
News November 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


