News February 26, 2025
చౌటుప్పల్: రూ.2వేలు ఇస్తే రూ.18,500 అంటూ మోసం!

రూ.2 వేలు ఫోన్పే చేస్తే 5 నిమిషాలలో రూ.18,500 ఇస్తామంటూ యువకులను మోసం చేసిన ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. ఆఫర్ ఇస్తున్నామంటూ ఓ ట్రస్ట్ పేరిట ఉమ్మడి కొయ్యలగూడెం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ సందేశం పంపారు. రూ.2 వేలు కడితే రూ.18,500 ఇస్తామన్నారని బాధితులు వాపోయారు.
Similar News
News December 1, 2025
డిసెంబర్ నెలలో పర్వదినాలు

DEC 1: గీతా జయంతి, సర్వ ఏకాదశి
DEC 2: మత్స్య, వాసుదేవ ద్వాదశి, చక్రతీర్థ ముక్కోటి
DEC 3: హనమద్ర్వతం, DEC 4: దత్త జయంతి
DEC 8: సంకటహర చతుర్థి
DEC 12: కాలభైరవాష్టమి
DEC 14: కొమురవెళ్లి మల్లన్న కళ్యాణం
DEC 15: సర్వ ఏకాదశి
DEC 16: ధనుర్మాసం ప్రారంభం
DEC 30: ముక్కోటి ఏకాదశి
News December 1, 2025
చిరు-వెంకీ సాంగ్.. 500 మంది డాన్సర్లతో షూటింగ్

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుంచి ఓ అప్డేడ్ చక్కర్లు కొడుతోంది. గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి మెగాస్టార్-విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్లో సాంగ్ షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 500 మంది డాన్సర్లతో ఈ పాటను గ్రాండ్గా చిత్రీకరిస్తున్నట్లు చెప్పాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని 2026 సంక్రాంతి బరిలో నిలపనున్నారు.
News December 1, 2025
మెదక్: ఏకగ్రీవం దిశగా మల్కాపూర్ తండా పంచాయతీ

మెదక్ మండలం మల్కాపూర్ తండాలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2019లో జరిగిన ఎన్నికల్లో సైతం ఏకగ్రీవం చేశారు. మొదటి సర్పంచ్ గా సరోజను ఎన్నుకున్నారు. ఈసారి దారావత్ బన్సీని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. గతంలో మల్లన్నగుట్ట తండా నుంచి సరోజ ఉండగా ఈసారి మల్కాపూర్ తండా నుంచి బన్సీ సర్పంచ్ కానున్నట్లు సమాచారం.


