News March 1, 2025

చౌటుప్పల్: హత్య కేసులో జీవిత ఖైదు

image

హత్య కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ భువనగిరి జిల్లా కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. వివరాలిలా.. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలిని బంగారం కోసం అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు(46) 2022లో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో జీవత ఖైదు, రూ.20 వేల జరిమానా విధించారు.

Similar News

News October 25, 2025

విద్యార్థులు ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలి: బాలలత

image

విద్యార్థులు వారికి ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేసిన బాలలత సూచించారు. వరంగల్ నిట్‌లో జరుగుతున్న టెక్నోజియాన్ రెండో రోజు ఆమె చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచిస్తూ, విజయవంతమైన వ్యక్తులు తమ సమయాన్ని ఆలోచన, సృష్టికి వినియోగిస్తారని పేర్కొన్నారు.

News October 25, 2025

సొంత డబ్బులు రాక ఉద్యోగుల ఇబ్బందులు: టీఎన్జీవో

image

ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న సొంత డబ్బులు రాక ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఐదు విడతల కరువు భత్యాన్ని విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు.

News October 25, 2025

ధాన్యం కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

image

ధాన్యం కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ సిబ్బంది శిక్షణ తరగతులు రవాణా, గన్నీ సంచులు, టార్పాలిన్లు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ప్రారంభమైన వరి కోతల వివరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.