News April 1, 2025
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. జనగామ జిల్లా మహిళా మృతి

ఛత్తీస్గఢ్లో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. కాగా, రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News November 8, 2025
VKB: ముత్యాల పందిరి వాహనంపై ఊరేగింపు

అనంత పద్మనాభ స్వామి కార్తీక మాస పెద్ద జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అనంత పద్మనాభ స్వామిని ముత్యాల పందిరి వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి పల్లకీ సేవలో పాల్గొన్నారు.
News November 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: రేపు సాయంత్రం నుంచి ప్రచారం బంద్

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. EC నిబంధనల ప్రకారం సాయంత్రం తర్వాత మైకులు బంద్ చేయాలి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ కూడా మూతబడనున్నాయి. నవంబర్ 11న పోలింగ్ ఉండడంతో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గెలుపు ఓటముల్లో పోల్ మేనేజ్మెంట్ కీలకం కానుంది.