News April 1, 2025
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. జనగామ జిల్లా మహిళా మృతి

ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News December 5, 2025
KMR: మూడు నెలలుగా వేతనాలు అందట్లేదని DMHOకు వినతి

కామారెడ్డి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విద్యకు వినతిపత్రం అందజేశారు. వేతనాలు రాకపోవడంతో ఇళ్లల్లో భారం ఏర్పడి, జీవితాలు కొనసాగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతినెల 1వ తేదీన వేతనాలు అందేలా ఉన్నతాధికారులకు నివేదించాలని కోరారు.
News December 5, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలలో మెగా ptm 3.0:ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
➤ జిల్లాలో విద్యుత్ షాక్ ఘటనలో ఇద్దరికీ గాయాలు
➤ నర్సీపట్నంలో అమృత మహిళా క్యాంటీన్ ను ప్రారంభించిన స్పీకర్
➤ నాలుగు కేజీల గంజాయితో తమిళనాడు వాసి అరెస్ట్
➤ పన్ను వసూలు పై నర్సీపట్నం మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్
➤ బాధ్యతలు స్వీకరించిన నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవో
➤ వాడ్రాపల్లిలో మధ్యాహ్న భోజనం పై నిలదీసిన పేరెంట్స్
News December 5, 2025
సంగారెడ్డి డీపీవో సాయిబాబా సస్పెండ్

సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు.


