News April 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్‌.. జనగామ జిల్లా మహిళా మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News December 3, 2025

నామినేషన్ల కేంద్రాలను తనిఖీ చేసిన ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ బుధవారం పరిశీలించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. నామినేషన్‌తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా కచ్చితంగా కలిగి ఉండాలని, అన్ని వివరాలు నింపాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సూచించారు. హెల్ప్ డెస్క్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

News December 3, 2025

కొమురవెల్లి మల్లన్న మూలవిరాట్ దర్శనం తాత్కాలిక నిలిపివేత

image

కొమురవెల్లి శ్రీ మల్లన్న దేవాలయంలో డిసెంబర్ 7 సాయంత్రం 8.30 గంటల నుంచి డిసెంబర్ 14 ఉదయం 6 గంటల వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. డిసెంబర్ 14న స్వామివారి కల్యాణోత్సవ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్లకు అలంకరణ పనులు జరుగుతున్నాయని ఆలయ EO వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం అర్ధ మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

News December 3, 2025

VKB: నామినేషన్ పత్రాలను చోరీ నిందితులపై చర్యలు SP

image

నామినేషన్ పత్రాలను చోరీ చేసిన నిందితులను వదిలిపెట్టమని ఎస్పీ స్నేహమేరా అన్నారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి నామినేషన్ క్లస్టర్‌లో చోరీపై ఎస్పీ స్పందించారు. గొట్లపల్లి క్లస్టర్‌లో తాళం పగలగొట్టి హన్మాపూర్, గిర్మాపూర్, జయరాంతండా(ఐ) గ్రామాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలు చోరీ ఘటనపై విచారణ చేపట్టామన్నారు.