News March 26, 2025
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. HNK జిల్లాలో విషాదం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో HNK జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అంకేశ్వరం సారయ్య అలియాస్ సుధీర్, సుధాకర్, మురళి మృతి చెందారు. 1990లో ఇంటి నుంచి బయటి వెళ్లిన సారయ్య ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. సారయ్యపై రూ.25 లక్షల రివార్డ్ ఉంది.
Similar News
News April 21, 2025
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్

వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఈనెల 24న RCBతో జరిగే మ్యాచుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారని, జట్టుతో బెంగళూరుకు వెళ్లకుండా జైపూర్‌లోని హోమ్ బేస్‌లో ఉంటారని RR ధ్రువీకరించింది. భవిష్యత్తు మ్యాచుల్లో ఆడతారా? లేదా? అన్నది సంజూ కోలుకోవడంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
News April 21, 2025
ప.గో: పోలీస్ శాఖ పీజీ ఆర్ఎస్‌కు 23 అర్జీలు

ప.గో జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌కు 23 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
News April 21, 2025
నాటి కడలూరు నేడు రైల్వేకోడూరు

కడలూరు అనే పేరుతో పూర్వం ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం నేడు రైల్వే కోడూరుగా కొనసాగుతోంది. బ్రిటిష్ వారి పాలనలో రైల్వే వ్యవస్థ విస్తరించిన కాలంలో, ఈ ప్రాంతం చివరి రైల్వే స్టేషన్‌గా ఉండేది. కాలక్రమేణా కడలూరు అనే పేరు కనుమరుగై, రైల్వే కోడూరు అనే పేరు స్థిరపడిపోయింది. ఈ చివరి స్టేషన్ వ్యాపారస్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ముఖ్యంగా బొంబాయి వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసేవారు.