News March 26, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. HNK జిల్లాలో విషాదం

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో HNK జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అంకేశ్వరం సారయ్య అలియాస్ సుధీర్, సుధాకర్, మురళి మృతి చెందారు. 1990లో ఇంటి నుంచి బయటి వెళ్లిన సారయ్య ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. సారయ్యపై రూ.25 లక్షల రివార్డ్ ఉంది.

Similar News

News December 3, 2025

రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

image

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.

News December 3, 2025

పెనుమంట్రలో ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని రైతులు RSKలను ధాన్యం అమ్మకాలకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని మార్టేరు బ్రాహ్మణచెరువు ప్రధాన రహదారిపై నిల్వ చేసిన ధాన్యం రాశులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. అనంతరం కొద్దిసమయం రైతులతో మాట్లాడారు.

News December 3, 2025

చిట్యాల: చిచ్చు పెట్టిన ఎన్నికలు.. మహిళ సూసైడ్

image

చిట్యాల (M) ఏపూరులో తల్లీకూతురు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం విషాదంగా మారింది. 3వ వార్డు అభ్యర్థులుగా తల్లి లక్ష్మమ్మను బీఆర్ఎస్ బలపరిచింది. ఆమె కూతురిని కాంగ్రెస్ బలపరిచింది. ఈ నేపథ్యంలో కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. అల్లుడు బండ మచ్చ టార్చర్‌ను తట్టుకోలేక లక్ష్మమ్మ (50) సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.