News January 21, 2025
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. నల్గొండ జిల్లా వాసి మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నల్గొండ జిల్లాకు చెందిన మావోయిస్ట్ మృతి చెందారు. చండూరు మం. పుల్లెంలకు చెందిన పాక హన్మంతు మరణించినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 45 ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. నల్గొండలోని ABVP నాయకుడు శ్రీనివాస్ హత్యలో హనుమంతు నిందితుడుగా ఉన్నాడు.
Similar News
News February 15, 2025
నల్గొండ: పురుగుమందు తాగి వివాహిత సూసైడ్

మునుగోడు మండలం ఉకొండిలో కుటుంబ కలహాలతో వివాహిత పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నిమ్మల మానస(28), భర్త నగేష్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. నగేష్ శుక్రవారం మునుగోడుకు వెళ్లి తిరిగి వచ్చే సరికి మానస పురుగు మందు సేవించి వాంతులు చేసుకుంది. చికిత్స కోసం నల్గొండ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.
News February 15, 2025
NLG: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
News February 15, 2025
జాతీయ కబడ్డీ పోటీలకు నల్గొండ జిల్లా యువతి

తెలంగాణ సీనియర్ మహిళా కబడ్డీ పోటీలకు హాలియా మండలం ఇబ్రహీంపేట చెందిన అయేషా ఎంపికయ్యారు. హరియాణాలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన అయేషాను పలువురు అభినందించారు.