News June 30, 2024

జంగారెడ్డిగూడెంలో యువత సంబరాలు

image

టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. యువత కేరింతలతో హోరెత్తించారు. జంగారెడ్డిగూడెంలో అర్ధరాత్రి యువత బైక్ ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Similar News

News October 13, 2024

మద్యం షాపులు లాటరీ ప్రక్రియకు అంతా సిద్ధం: కలెక్టర్

image

ప.గో. జిల్లాలో అక్టోబర్ 14వ తేది జరగబోయే మద్యం షాపుల లాటరీ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని మొత్తం 175 షాపులకు 5,627 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. పెదమిరం నిర్మల ఫంక్షన్ హాల్‌లో ఉదయం 8 గంటల నుంచి లాటరీ విధానం మొదలవుతుందని అన్నారు. దరఖాస్తుదారుడు ఐడీ ప్రూఫ్‌తో రావాలన్నారు.

News October 13, 2024

ప.గో జిల్లాలో 183.4 మి.మీ. వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల్లో జిల్లాలో కురిసిన వర్షపాతం 183.4 మీ.మీ. అని జిల్లా వాతావరణ శాఖాధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా ఆకివీడులో 29.0 మి.మీ, అత్తిలిలో 28.8 మి.మీ, ఇరగవరంలో 22.4 మి.మీ, పెనుగొండలో 16.8 మి.మీ, అత్యల్పంగా గణపవరంలో 2.6 మి.మీ పోడూరులో 3.8 మి.మీ, యలమంచిలిలో 4.4 మి.మీ నమోదు కాగా నరసాపురం, మొగల్తూరు, ఆచంటలో అసలు వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

News October 13, 2024

ప.గో జిల్లాలో నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

image

ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అధికారులు కన్నుల పండుగగా అలంకరించారు. ఈ నెల 20 వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 17వ తేదీ రాత్రి స్వామివారి తీరు కళ్యాణం, 18వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.