News October 4, 2024

జంగారెడ్డిగూడెం: అమ్మను కొట్టిందని అక్కపై కత్తితో దాడి

image

అమ్మను కొట్టిందని తమ్ముడు అక్కపై కత్తితో దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో జరిగింది. స్థానికుల కథనం.. ఏసోబు, అతని తల్లి వద్దనే ఎస్తేరు రాణి భర్తతో విడిపోయి ఉంటోంది. తల్లితో అప్పుడప్పుడూ రాణి గొడవ పడేది. ఈక్రమంలో గురువారం వాగ్వాదం జరిగి తల్లిని కొట్టి వెళ్లిపోయింది. పని నుంచి వచ్చిన ఏసోబుకు తల్లి విషయం చెప్పింది. దీంతో ఏసోబు కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.

Similar News

News November 3, 2024

సెమీఫైనల్‌కు చేరిన ఉమ్మడి పశ్చిమగోదావరి బాలికల జట్టు

image

పల్నాడు జిల్లా నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ నందు జరుగుతున్న 68వ రాష్ట్రస్థాయి S G F U/14 బాలబాలికల బాస్కెట్బాల్ పోటీల్లో బాలికల విభాగంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు మీద 26-13 స్కోర్‌తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం రాత్రి సెమీఫైనల్ పోటీల్లో పశ్చిమ జట్టు వేరే జట్టుపై తలపడనుందని పీడీ శ్రీనివాసరావు తెలిపారు.

News November 3, 2024

ప.గో: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

image

నల్లజర్ల మండలం పుల్లపాడు హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. మృతులు అనంతపురం శారదనగర్‌కు చెందిన కనకదుర్గ (70) అక్కడికక్కడే మృతి చెందగా.. సుసర్ల శ్రీలక్ష్మి (82)కి తీవ్రగాయాలవ్వడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారు అనంతపురం నుంచి కాకినాడ వెళ్తున్నట్లు వివరించారు.

News November 3, 2024

నిడదవోలులో మంత్రి కొత్త కార్యాలయం ప్రారంభం

image

నిడదవోలు పట్టణ 1వ వార్డ్ బాలాజీ నగర్‌లో మంత్రి కందుల దుర్గేశ్ జనసేన కొత్త కార్యాలయాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. కార్యక్రమంలో నిడదవోలు టీడీపీ ఇన్‌ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు తమ సమస్యలను ఇక్కడికి వచ్చి విన్నవించడం కోసం ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.