News August 5, 2024
జంగారెడ్డిగూడెం ఎర్రకాలువలో చనిపోయింది ఈమే

జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం ఎర్రకాలువ వాగు వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. వారు పోలీసులకు సమాచారం అందించగా SI జ్యోతిబసు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు ద్వారకాతిరుమల మండలం ఐఎస్.జగన్నాథపురానికి చెందిన పంపన వెంకాయమ్మ (50)గా గుర్తించారు. 4 రోజులు క్రితం అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారని ఎస్సై చెప్పారు.
Similar News
News October 17, 2025
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై భీమవరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం సేకరణ త్వరలో ప్రారంభం కానున్నందున, సంబంధిత అధికారులు ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలకు సూచించారు.
News October 17, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు 42 మంది విద్యార్థులు ఎంపిక

ఉమ్మడి ప.గో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల్లో తణుకు ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత నెల 12 నుంచి ఈనెల 15 వరకు అండర్-19 విభాగంలో వీరంతా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సత్యఉషారాణి అభినందించారు.
News October 17, 2025
‘కార్తీక మాసంలో పర్యాటకులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి’

కార్తీక మాసంలో పేరుపాలెం బీచ్కు వచ్చే పర్యాటకులకు ఆయా శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని నర్సాపురం ఆర్డీవో దాసిరాజు అధికారులకు సూచించారు. గురువారం కేపీపాలెం బీచ్ వద్ద కార్తీక మాస ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బీచ్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ, డీఎల్పీఓ, ఎమ్మార్వో తదితర అధికారులు పాల్గొన్నారు.