News July 30, 2024
జంగారెడ్డిగూడెం: గదిలో బంధించి అత్యాచారం

జంగారెడ్డిగూడెంలో బాలికపై అత్యాచారం జరిగింది. స్థానిక యువకుడికి విజయనగరం బాలిక ఇన్స్టాలో పరిచయమైంది. అతడిని కలిసేందుకు JRG బస్టాండ్ వద్దకు వచ్చింది. యువకుడు బాలికతో మాట్లాడి కాసేపట్లో వస్తానని వెళ్లిపోయాడు. తిరిగిరాకపోవడంతో అక్కడే ఉన్న శ్రీను అనే వ్యక్తి బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ రాజు అనే మరొక వ్యక్తి బాలికను ఊరు పంపిస్తానని చెప్పి రూంలో ఉంచి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 25, 2025
ప.గో: ఆన్లైన్లో పందెంకోళ్లు

సంక్రాంతి సమీపించడంతో కోడిపుంజుల విక్రయాలు జోరందుకుంటున్నాయి. బైక్లు, గృహోపకరణాల తరహాలోనే.. సోషల్ మీడియా వేదికగా పుంజుల ఫొటోలు, వీడియోలు, జాతి, బరువు వంటి వివరాలను పోస్ట్ చేస్తూ విక్రేతలు ఆకర్షిస్తున్నారు. పాలకొల్లులో రహదారుల పక్కన విక్రయాలు సాగుతుండగా.. దూర ప్రాంతాల నుంచి విచ్చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. జాతి, సైజును బట్టి ఒక్కో కోడి రూ.1500 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నారు.
News November 25, 2025
భీమవరం: పీజీఆర్ఎస్కు 15 అర్జీలు

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.