News October 7, 2024
జంగారెడ్డిగూడెం: యువకుడిపై పోక్సో కేసు నమోదు

జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ బాలిక గత నెల 30న ఇంటి నుంచి అదృశ్యమైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరులోని షారుఖ్ ఖాన్‌పై అనుమానం ఉన్నట్లు తల్లి చెప్పడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు కడపలో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు మాయమాటలు చెప్పి బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో అదృశ్యం కేసును పోక్సో కేసుగా మార్పు చేశామన్నారు.
Similar News
News December 1, 2025
తణుకులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

తణుకు పట్టణంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాష్ట్రపతి రోడ్డులోని కోర్టు సమీపంలో సుమారు 50 ఏళ్లు వయసు కలిగిన మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు స్థానికంగా యాచకం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
News December 1, 2025
AP NIT, YSR ఉద్యాన వర్సిటీ మధ్య MOU

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్(AP NIT)తో వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సోమవారం అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. డ్రోన్ టెక్నాలజీ, డ్రయ్యర్ టెక్నాలజీ, నీటి పారుదలలో ఆధునిక యాంత్రికరణ, తెగుళ్లు గుర్తించడం, నానో టెక్నాలజీ తదితర అంశాల్లో రైతులకు అవగాహన కల్పించి ఖర్చులు తగ్గించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఏపీ నిట్ డైరెక్టర్ రమణ రావు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు.
News December 1, 2025
మొగల్తూరు: ‘నేడు పేరుపాలెం బీచ్‌కు రావొద్దు’

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పేరుపాలెం బీచ్‌కి సోమవారం సందర్శకులను అనుమతించబోమని మొగల్తూరు ఎస్ఐ జి.వాసు తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు. బీచ్ సందర్శనకు రావొద్దని సూచించారు.


