News October 7, 2024
జంగారెడ్డిగూడెం: యువకుడిపై పోక్సో కేసు నమోదు
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ బాలిక గత నెల 30న ఇంటి నుంచి అదృశ్యమైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరులోని షారుఖ్ ఖాన్‌పై అనుమానం ఉన్నట్లు తల్లి చెప్పడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు కడపలో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు మాయమాటలు చెప్పి బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో అదృశ్యం కేసును పోక్సో కేసుగా మార్పు చేశామన్నారు.
Similar News
News November 11, 2024
జెడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీపై అనర్హత వేటు?
ఉమ్మడి ప.గో జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ఇటీవల వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే. ఆమెపై చర్యలు తీసుకోవాలని ZPTCలు ZP సీఈవోకు నోటీసులు పంపారు. శుక్రవారం జరిగిన జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని YCP జెడ్పీటీసీలు బహిష్కరించి ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు ఉమ్మడి జిల్లా అత్యవసర సర్వసభ్య సమావేశం జరపాలని అనుకోగా..ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.
News November 11, 2024
మన ప.గో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం వినిపిస్తారా?
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వాటికి ఉమ్మడి ప.గో జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం కావడంతో ప్రజల్లోనూ, నాయకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు గ్రామంలో సమస్యలు , యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు గుమ్మరించారు. మరి వాటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో గళం వినిపిస్తారా? లేదా? మీరేమంటారు. కామెంట్ చేయండి.
News November 10, 2024
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుక: కలెక్టర్ నాగారాణి
ఇసుక వినియోగదారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుకను పొందాలని ప.గో.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇసుక అందుబాటులో లేనందున తూ.గో.జిల్లా తిపర్రు- 2&3, ఔరంగాబాద్ రీచ్‌ల ద్వారా ఇసుకను పొందేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తిపర్రులో రూ.96.02, ఔరంగాబాద్‌లో రూ.229 చెల్లించాల్సి ఉందని, దీనికి రవాణా ఛార్జీలు అదనం అన్నారు.