News March 24, 2024
జంగారెడ్డిగూడెం: 26న నారా భువనేశ్వరి రాక

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత భీమడోలు వెంకన్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి మంగళవారం పేరంపేట గ్రామానికి వస్తున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు సాయిల సత్యనారాయణ తెలిపారు. నేతలు కార్యకర్తలు తరలి రావాలని తెలిపారు.
Similar News
News January 3, 2026
తాడేపల్లిగూడెంలో కొట్టుకు చెక్..?

తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొట్టు సత్యనారాయణపై అసంతృప్తితో ఉన్న పార్టీ నేతలు జగన్‌ను కలిశారని ప్రచారం సాగుతోంది. సర్పంచ్‌లు, ఎంపీపీలు పార్టీని వీడటంతో వడ్డీ రఘురామ్‌కు బాధ్యతలు అప్పగించాలని వారు కోరినట్లు సమాచారం. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు టాక్. త్వరలోనే వడ్డీ రఘురామ్ నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గుసగుసలు.
News January 3, 2026
భీమరం: అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

సంస్కతీ సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవరంలో సంక్రాంతి సంబరాలను డిప్యూటీ స్పీకర్, కలెక్టర్ భోగి మంటలు వేసి ప్రారంభించారు. బొమ్మలకొలువు, రంగవల్లులు, గొబ్బమ్మలు, భోగిమంట, హరిదాసులు, కోలాటం, సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
News January 3, 2026
భీమవరం: గోదావరి క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన కలెక్టర్

భీమవరంలో రెండురోజులపాటు జరిగే గోదావరి క్రీడా ఉత్సవాలను శనివారం కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన బృందాలు జిల్లా స్థాయిలో తలపడనున్నాయి. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, చెస్, టెన్ని కాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్ పుట్ వంటి 9 క్రీడాంశాలలో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారని తెలిపారు.


