News March 6, 2025
జంగారెడ్డిగూడెం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రాలు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగాల్సిన గీతకులాల మద్యం షాపుల ఆన్‌లైన్ విధానం వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగియడంతో జంగారెడ్డిగూడెం మండలంలో దరఖాస్తులు చేసుకున్న వారందరూ 6వ తేదీ ఉదయం 8. గంటలకు డ్రా ఉంటుందన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి మీటింగ్ హాల్‌లో జరుగు డ్రాలో పాల్గొనాలని జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనుబాబు కోరారు. దరఖాస్తు దారులు అందరూ హాజరు కావాలన్నారు.
Similar News
News January 3, 2026
71 MPలు రిటైర్.. మోదీ క్యాబినెట్‌లో కీలక మార్పులు?

2026లో మొత్తం 71 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు BJPకి కీలకం కానున్నాయి. రిటైర్ అవుతున్న వారిలో 30 మంది ఆ పార్టీ వారే ఉండగా.. హర్దీప్ సింగ్ పురీ సహా ఆరుగురు కేంద్ర మంత్రుల టర్మ్ ముగియనుంది. దీంతో మోదీ క్యాబినెట్‌లో మార్పులు ఖాయమనిపిస్తోంది. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా 8మంది కాంగ్రెస్ సభ్యులూ రిటైర్ అవుతున్నారు. UP(10), బిహార్(5) వంటి రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
News January 3, 2026
మేడారం జాతర.. అక్రమార్కులపై ‘కేకన్’ కేకలు..!

మేడారం జాతరంటే అందరికీ కాసుల పండగే. అక్రమాలకు అలవాటు పడిన కొందరు అధికారులు తమ వక్ర బుద్దిని ప్రదర్శిస్తూ బుక్ అవుతున్నారు. గత జాతరలో కమీషన్‌లకు అలవాటు పడిన కొందరు అధికారులు ఈ జాతరలో కూడా వాటి కోసం కక్కుర్తి పడాలనుకొని SP సుధీర్ రాంనాథ్ కేకన్ చేతిలో బుక్ అయ్యారు. అక్రమాలకు తావు లేకుండా SP డబుల్ చెక్ చేయడంతో వారికి ‘సంతోషం’ లేకుండా పోయింది. తడికెలు, మెస్ లాంటి వాటిపై SP సీరియస్ అయినట్లు తెలిసింది.
News January 3, 2026
కొండగట్టులో పవన్‌కు స్వాగతం పలికిన అర్చకులు

కొండగట్టు అంజన్న ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, పలువురు నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


