News February 11, 2025
జక్కాపూర్ పాఠశాల విద్యార్థుల సత్తా

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఫలితాల్లో నారాయణరావుపేట మండలం జక్కపూర్ ZPHS విద్యార్థులు స్తతా చాటారు. జిల్లా మొదటి ర్యాంకుతో పాటు మొత్తం 13 మంది అర్హత సాధించారు. ఒకే పాఠశాల నుంచి ఇంత పెద్ద ఎత్తున అర్హత సాధించడం జిల్లాలోనే మొదటి సారి అని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్నారు.
Similar News
News December 2, 2025
మెదక్: భార్యను చంపి భర్త సూసైడ్ !

మెదక్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. టేక్మాల్ మండలం బర్దిపూర్లో భార్యను చంపి, భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయానికి మంజుల హత్యకు గురికాగా, శ్రీశైలం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 2, 2025
సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల..

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు సీఎం చేరుకుని 12:50కి హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం బయలుదేరుతారు. 2 గంటలకు భద్రాద్రి కలెక్టరేట్కు చేరుకుంటారు. 2:15 నుంచి 2:40 గంటల మధ్య యూనివర్సిటీని ప్రారంభిస్తారు. 2:45 నుంచి 3:45 గంటల వరకు యూనివర్సిటీ ప్రాంగణంలోని గ్రౌండ్లో జరిగే సభలో CM ప్రసంగిస్తారు.
News December 2, 2025
ఈ ఆపిల్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది

సాధారణ ఆపిల్స్ను ఫ్రిజ్లో ఉంచితే కొన్ని రోజులకే రుచి మారిపోతాయి. అయితే ‘కాస్మిక్ క్రిస్ప్’ అనే ఆపిల్ మాత్రం చల్లని ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. రుచి మారదు. అలాగే దీన్ని కోసిన తర్వాత కూడా ముక్కలు చాలా సేపటి తర్వాతే గోధుమ రంగులోకి మారతాయి. వాషింగ్టన్ స్టేట్ వర్శిటీ 20 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి దీన్ని రూపొందించింది. ఇది ఎరుపు రంగులో తీపి, పులుపుగా, ముక్కకాస్త దృఢంగా ఉంటుంది.


