News March 23, 2025
జక్రాన్‌పల్లి: ఇస్టాగ్రాంలో పరిచయం.. యువకుడి అరెస్టు

AP రాష్ర్టం ఏలూరు జిల్లాకు చెందిన బాలికకు జక్రాన్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. మూడు నెలల క్రితం ఆమెను జక్రాన్‌పల్లికి తీసుకువచ్చాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడికి జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌కు చెందిన మరో వ్యక్తి సహకరించాడు.
Similar News
News March 26, 2025
బాన్సువాడ: పెళ్లైన నెలకే నవవధువు ఆత్మహత్య

బాన్సువాడ కొల్లూరులో లక్ష్మి, వెంకటేశ్‌లకు FEB 23న వివాహం జరిగింది. అయితే ఇష్టంలేని పెళ్లి చేయడంతోనే లక్ష్మి మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ అశోక్ తెలిపారు. సూసైడ్ అటెంప్ట్ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు బాన్సువాడ ఏరియా ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. మృతురాలి తల్లి చంద్రకళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
News March 25, 2025
NZB: ‘మహిళా సంఘాలకు 200 పైచిలుకు కొనుగోలు కేంద్రాలు’

యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పీ.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గానూ మహిళా సంఘాలకు కనీసం 200పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మహిళా సంఘాలకు ఆయన కీలక సూచనలు చేశారు.
News March 25, 2025
సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి!

మంత్రివర్గ విస్తరణలో భాగంగా బోధన్ MLAకు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. కాగా MLC మహేశ్ కుమార్ గౌడ్‌కు PCC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే BSWDకి చెందిన కాసుల బాల్‌రాజ్‌కు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా నియమించింది. బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్‌కు టీజీఎండీసీ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికి మంత్రి పదవీ దక్కలేదు. జిల్లాకు అమాత్య యోగముందా కామెంట్ చేయండి.