News January 3, 2025
జగదల్పూరు వరకే విశాఖ-కిరండూల్ రైలు

కేకే లైన్లో జరుగుతున్న పనుల వలన విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లు జగదల్పూరు వరకు నడుస్తాయని అరకు రైల్వే అధికారులు తెలిపారు. జనవరి 5న విశాఖ-కిరండూల్ (18514) నైట్ ఎక్స్ ప్రెస్, జనవరి 6న విశాఖ-కిరండూల్(58501) పాసింజరు జగదల్పూర్ వరకు నడుస్తాయన్నారు. తిరుగు ప్రయాణం జనవరి 6న కిరండూల్-విశాఖ(18513) నైట్ ఎక్స్ ప్రెస్, జనవరి 7న కిరండూల్-విశాఖ(58502) పాసింజర్ రైళ్లు జగదల్పూర్ నుంచి బయలుదేరుతాయన్నారు.
Similar News
News December 9, 2025
బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

ఆర్కే బీచ్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
News December 9, 2025
విశాఖ: రేపటి నుంచి 21 వరకు టెట్ పరీక్ష

డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని 12 కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ మంగళవారం తెలిపారు. విశాఖ జిల్లాలో 11 కేంద్రాలు, అనకాపల్లి, మాకవరపాలెంలో ఒక కేంద్రం ఉందని పేర్కొన్నారు. మొత్తం 26,248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు వివరించారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
News December 9, 2025
విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


