News April 24, 2024
జగదేవపూర్: చికెన్ సెంటర్లో దారుణ హత్య

జగదేవపూర్‌లోని రాంరెడ్డి చికెన్ సెంటర్ యజమాని అనుమానాస్పదంగా మృతిచెందాడు. చికెన్ సెంటర్లో పనిచేసే కలకతకు చెందిన యువకులు చికెన్ సెంటర్ యజమాని, తూప్రాన్ మండలం వెంకటాపూర్‌కు చెందిన బి.మహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గజ్వేల్ రూరల్ CI మహేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా చికెన్ సెంటర్లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు తెలిసింది.
Similar News
News November 28, 2025
మెదక్: నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

హవేలీఘనపూర్ నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్లు పారదర్శకంగా, క్రమశిక్షణతో సాగాలని, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. 29వ తేదీ చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్లకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పత్రాలు సమృద్ధిగా ఉంచి, వెంటనే స్కాన్ చేయాలని, అభ్యర్థులు ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
News November 28, 2025
రేపు మెదక్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మెదక్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి వి.హేమ భార్గవి తెలిపారు. పరుగు పందెం, షాట్ పుట్, చెస్, కార్రమ్స్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సమస్త దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.
News November 28, 2025
ఫూలే వర్ధంతి: మంత్రి పొన్నం నివాళి

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఫూలే చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.


