News June 25, 2024
జగదేవపూర్: నాటి ప్రభుత్వ టిచరే నేటి విద్యాశాఖ డైరెక్టర్

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా నియామకమైన E.వెంకట నరసింహారెడ్డి 1989 DSC ద్వారా జిల్లా ఫస్ట్ ర్యాంకుతో SA మ్యాథ్య్గా ఉమ్మడి జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్, జగదేవపూర్ మండలం మునిగడపలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌గా విధులు నిర్వహించారు. అనంతరం GROUP-1 అధికారిగా 1995లో నియామకమై 2017లో IASగా పదోన్నతి పొందారు. ప్రస్తుత ప్రభుత్వంలో పాఠశాల డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Similar News
News December 1, 2025
MDK: అభ్యర్థులకు కొత్త బ్యాంక్ ఖాతా తప్పనిసరి: కలెక్టర్

స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలని, అన్ని లావాదేవీలు ఆ ఖాతా ద్వారా జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని, పాత కుల సర్టిఫికెట్ కూడా చెల్లుబాటు అవుతుందని అన్నారు. సమస్యల కోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
News December 1, 2025
MDK: 15 హామీలతో అభ్యర్థి బాండ్ పేపర్

హవేలి ఘనపూర్ మండలం రాజుపేట్ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మౌనిక 15 హామీలతో బాండ్ రాసిచ్చి ప్రచారం చేస్తున్నారు. 6 నెలలలోపు కొత్త ట్రాలీ కొని చెత్తసేకరణ, వృద్దులకు ఇంటివద్దకే పింఛన్ పంపిణీ, రోజు మంచినీటి సరఫరా, కొత్తగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి రూ.లక్ష లోన్ మంజూరు,
గిరిజనుల తీజ్ పండుగకు ఏడాదికి రూ.20 వేలు, ముదిరాజ్ బోనాలకు రూ.8 వేలు ఇలా హామీలను బాండ్‌పై రాసి ప్రచారం చేస్తున్నారు.
News December 1, 2025
మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.


