News March 14, 2025

జగదేవ్‌పూర్: బాలిక ఆత్మహత్య

image

జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News July 6, 2025

ఫార్మాసూటికల్స్‌‌లో అపార అవకాశాలు: మోదీ

image

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో అద్భుతమైన సమావేశం జరిగినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘అర్జెంటీనాతో 75 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు, అందులోనూ 5 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. రానున్నకాలం ఇరు దేశాల మధ్య మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయం, రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకారం గురించి చర్చించాం. ఫార్మాస్యూటికల్స్, క్రీడల వంటి రంగాల్లోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయి’ అని తెలిపారు.

News July 6, 2025

NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

image

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.

News July 6, 2025

అనంతగిరిగా మార్చాలని డిమాండ్.. మీ కామెంట్ ?

image

వికారాబాద్ జిల్లాలో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. చుట్టు అడవి, గుట్టమీద అనంత పద్మనాభస్వామి కొలుదీరిన ప్రాంతానికి అనంతగిరి జిల్లాగా పేరు మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అనంతగిరి గుట్టల ప్రకృతి సోయగాలు, మూసీ నది జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందటంతో జిల్లా పేరు మార్చాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై మీ కామెంట్.