News July 31, 2024
‘జగనన్న హౌసింగ్ లేఅవుట్లో భారీ అక్రమాలు’

YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. లబ్ధిదారుల కోసం గత వైసీపీ ప్రభుత్వం 8468 ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 2,489 ఇళ్లు అనర్హులకు కేటాయించినట్లు తాజాగా గుర్తించారు. జగనన్న లేఅవుట్లలో విచారణ జరపాలని ఇటీవల ప్రభుత్వానికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ శివ శంకర్ విచారణ జరిపి, 2,489 మంది అనర్హులు ఉన్నట్లు తేల్చారు.
Similar News
News January 23, 2026
కడప: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

కడప జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19 నుంచి అందుబాటులోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.
News January 23, 2026
కడప జిల్లాలో VRO సస్పెండ్.!

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.
News January 23, 2026
కడప: Way2News ఎఫెక్ట్ VRO సస్పెండ్