News September 29, 2024
జగన్‌కు పరిపాలన చేయడం రాదు: మంత్రి నారాయణ
ఏపీ మాజీ సీఎం జగన్‌కు పరిపాలన చేయడం రాదని మంత్రి నారాయణ అన్నారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల వద్ద మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చైనా పర్వాలేదని సీఎం చంద్రబాబు అన్నారని చెప్పారు. పాలకొల్లులోని ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News October 14, 2024
ఏలూరు ఎస్పీ పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News October 14, 2024
నరసాపురం: మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు
సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నరసాపురం ఆర్డీవో దాసి రాజు మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర అలలు ఎగసి పడుతాయని, మళ్లీ ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు.
News October 14, 2024
బందోబస్తును పరిశీలించిన ఏలూరు ఎస్పీ
ఏలూరు జిల్లా వైన్స్ లాటరీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన చలసాని గార్డెన్‌లోని బందోబస్తు ప్రదేశాన్ని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.