News June 26, 2024
జగన్‌కు ప్రతిపక్ష హోదా అడిగే హక్కు లేదు: మంత్రి సంధ్యారాణి

ప్రతిపక్ష హోదా అడిగే హక్కు జగన్ కు లేదని మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభలో ఒక్క నిమిషం కూడా ఉండలేని జగన్ ఇంకా ప్రజా సమస్యల కోసం ఏం పోరాడుతారని ప్రశ్నించారు.
Similar News
News February 12, 2025
VZM: హత్యకు గురైన MRO భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.
News February 12, 2025
చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులు

బొబ్బిలి పట్టణంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీలో బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు రికవరీ చేశారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిందుతులను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. నగల వ్యాపారి రవి ఇంటిలో ఈనెల 1న చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు రాయగడ వెళ్తుండగా 45తులాలను స్వాధీనం చేసుకుని ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఏ1 ముద్దాయి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
News February 12, 2025
ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలి: SP

మర్యాదకర ప్రవర్తనతో ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ప్రజలతో మంచిగా ప్రవర్తించి, పోలీసుశాఖ ప్రతిష్ఠతను పెంచాలన్నారు. స్టేషనుకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు స్టేషనుకు ఏ కారణంతో వచ్చింది తెలుసుకొని, వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని సూచించారు.