News March 12, 2026
జగన్‌కు మంత్రి సవిత వార్నింగ్!

కూటమిపై బురద జల్లడం మానుకోవాలని జగన్‌కు మంత్రి సవిత హితువు పలికారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ అన్నారు. ఆయనకు విజన్ లేదని, రాష్ట్రం గురించి ఆలోచన లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేసినా జగన్ పారిపోయాడన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చొని చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం మానుకోవాలన్నారు. లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
Similar News
News April 14, 2026
కీర దోసతో ఎన్ని లాభాలంటే..?

ఎండాకాలంలో చెమట రూపంలో కోల్పోయిన నీటిని, శక్తిని తిరిగి పొందడానికి కీర దోస ఉపయోగపడుతుంది. అందులోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను, శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కీర దోస చాలా మంచిది. రోజూ తినడం వల్ల టాక్సిన్స్ తొలగిపోతాయి.
News April 14, 2026
జనగామ: 94 మంది పంచాయతీ సెక్రటరీల బదిలీ

జనగామ జిల్లా వ్యాప్తంగా 94 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సెక్రటరీలు తమ కొత్త నియామక స్థానాల్లో 24 గంటల్లోపు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. గ్రామ పరిపాలనలో పారదర్శకత, పనితీరు మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఒకేసారి ఇంత భారీగా బదిలీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
News April 14, 2026
మాస్టర్ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలి: శైలజా రామయ్యర్

కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి అంత్య పుష్కరాల పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాత్కాలిక పనులను 15 రోజుల ముందే పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులకు టెండర్లు పిలవాలని, పూర్తయిన వాటికి నిధులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు.


