News February 25, 2025
జగన్‌కు మేమే టికెట్లు కొనిస్తాం: సోమిరెడ్డి

అసెంబ్లీకి రాని YCP ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలని సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేశారు. ‘జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ఎక్కువ సేపు మాట్లాడవచ్చు. ప్రతిపక్ష నేతలకు ఫ్రీగా విమానం టికెట్, కారుకు డీజిల్, పీఏను ఇస్తారు. జగన్‌కు ఫ్రీగా విమానం టికెట్లు కావాలంటే మేమే చందాలు వేసుకుని కొనిస్తాం’ అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
Similar News
News February 25, 2025
నెల్లూరు: ఈ బాల్యం బడి బాట పట్టేనా..?

బడి ఈడు గల పిల్లలందరూ బడిలో ఉండాలి, బాల కార్మిక వ్యవస్థ వద్దు, బడిబాట పట్టాల్సిన చిన్నారులు, పని బాట పట్టకూడదని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం చెబుతూ ఉంటారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదని పలువురు విమర్శిస్తున్నారు. దుత్తలూరు మండలంలో పలువురు చిన్నారులు చెత్త కాగితాలు ఏరుకుంటూ, మరికొందరు బట్టీల వద్ద, క్రషర్ల వద్ద తమ బాల్యాన్ని ధారపోస్తున్నారు. వీరిని బడిబాట పట్టించాలని పలువురు కోరుతున్నారు.
News February 25, 2025
నెల్లూరు జిల్లాకు రూ.33.52 కోట్ల విడుదల

నెల్లూరు జిల్లాకు 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రూ.33.52 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1.68 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ నిధులు రైతుల ఖాతాలకు నేరుగా జమవుతాయని తెలిపారు. రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున నగదు జమవుతుందన్నారు.
News February 25, 2025
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు ఎస్పీ

ప్రముఖ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో నెల్లూరు జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వల వేస్తారని చెప్పారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.