News January 7, 2025

జగన్‌కు షాక్ ఇచ్చిన విజయవాడ కోర్ట్

image

పాస్‌పోర్టు విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్‌ను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. పాస్‌పోర్టు దరఖాస్తుకు NOC ఇవ్వాలని జగన్ పిటిషన్ వేశారు. 2024లోనే పాస్‌పోర్టు ఎక్స్‌పైర్ అయినట్లు ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. కాగా పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని జగన్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు సూచించింది. 

Similar News

News January 16, 2025

17న కృష్ణా జిల్లాకు కేంద్రమంత్రి అమిత్ షా

image

కేంద్ర మంత్రి అమిత్‌షా ఈనెల 17,18 కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 17 రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. 18వ తేదీ గన్నవరం మండలంలోని కొండపావులూరులో నూతనంగా నిర్మించిన NIDM, NDRF, 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభించనున్నారు. 

News January 16, 2025

రూ.1.25కోట్ల పందెం గెలిచిన గుడివాడ కోడి

image

గుడివాడ మండలానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి నిన్న ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోడి పందెంలో రూ.1.25కోట్లను గెలుచుకున్నారు. దీంతో నిన్నటి వరకు ఒక ఎత్తు నిన్నటి నుంచి మరో ఎత్తు అన్న చందాన గుడివాడ ప్రభాకర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. కాగా ఆయన ప్రతినిత్యం కోళ్లతో మమేకమవుతూ కోడిపందేల్లో ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా పేరొందారు.

News January 16, 2025

కృష్ణా: ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా డీసీసీబీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్‌ల పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. కృష్ణాజిల్లాలో 66 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను 17 పీఏసీఎస్ ఇన్ సర్వీసుల ఉద్యోగులకు కేటాయించారు. ఈనెల 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.