News July 22, 2024
జగన్‌కు RRR రిక్వస్ట్
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వైసీపీ అధినేత జగన్‌ను <<13680466>>అసెంబ్లీ<<>>లో పలకరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి రోజూ రావాలని జగన్‌ను కోరానని రఘురామ తెలిపారు. ప్రతిపక్షం సభలో లేకపోతే బాగుండదని చెప్పానన్నారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారన్నారు.
Similar News
News December 10, 2024
రాజమండ్రి: ‘టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోంది’
టీడీపీలో బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుందని, బీసీ కులాల గొంతు నొక్కిన చంద్రబాబు చరిత్రలో బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారని జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సీట్ల కేటాయింపులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అన్యాయమన్నారు. ఈనెల 13న రైతులకు అండగా కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
News December 9, 2024
తూ.గో: మళ్లీ పులి సంచారం.?
తూ.గో. జిల్లా ఏజెన్సీ ఏరియాలో కొద్దిరోజులుగా పులి సంచారం ప్రజలను భయపెడుతోంది. ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లోనూ పులి సంచరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాపన్నధార ఏరియాలో ఆదివారం ఓ పశువు చనిపోవడంతో పోలీసు అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. పశువును చంపింది పులి లేదా ఏదైనా అడవి జంతువా అనేది అధికారులు నేడు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇటీవల 45 రోజులపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి తిరిగింది.
News December 9, 2024
నేడు ప్రజా సమస్యల అర్జీల స్వీకరణ: తూ.గో కలెక్టర్
రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం గ్రివెన్స్ డేను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశానని సద్వినియోగం చేసుకోవాలన్నారు.