News June 25, 2024
జగన్‌ది కిమ్‌ను తలదన్నే వ్యవహారశైలి: దేవినేని ఉమా

మాజీ సీఎం జగన్‌ది కిమ్‌ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్‌కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్‌ను ఆయన Xలో ప్రశ్నించారు.
Similar News
News December 20, 2025
కృష్ణా: మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్ నడిపిన కలెక్టర్

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగంగా కృష్ణా కలెక్టరేట్‌లో శనివారం ‘క్లీన్ & క్లీన్’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ వినూత్నంగా స్పందించారు. స్వయంగా మున్సిపాలిటీ చెత్త ట్రాక్టరును నడిపి, ప్రాంగణంలోని వ్యర్థాలను సేకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని కలెక్టరేట్ మూలమూలలా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.
News December 19, 2025
DRC సమావేశాలను సీరియస్‌గా తీసుకోండి: బుద్ధప్రసాద్

ఎంతో ప్రాధాన్యత కలిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం (DRC) నిర్వహణను సీరియస్‌గా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను కోరారు. శుక్రవారం సాయంత్రం సుభాష్ అధ్యక్షతన DRC సమావేశం నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 4 గంటలకు ప్రారంభం కావడం పట్ల బుద్ధప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
News December 19, 2025
పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పరిశ్రమలు, తదితర అంశాల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో APIIC ద్వారా గత 2ఏళ్లలోపు మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని వారితో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.


