News June 25, 2024
జగన్‌ది కిమ్‌ను తలదన్నే వ్యవహారశైలి: దేవినేని ఉమా

మాజీ సీఎం జగన్‌ది కిమ్‌ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్‌కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్‌ను ఆయన Xలో ప్రశ్నించారు.
Similar News
News November 20, 2025
GNT: జిల్లా గ్రంథాలయ సంస్థలకు జాయింట్ కలెక్టర్లు ఇన్‌ఛార్జ్‌లు

రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థల వ్యవహారాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం 6 నెలల పాటు లేదా కొత్త ఛైర్మన్ నియామకం వరకు అమల్లో ఉంటుంది. పబ్లిక్ లైబ్రరీస్ చట్టం 1960 ప్రకారం ఈ ఉత్తర్వులను గవర్నర్ ఆమోదించారు.
News November 20, 2025
చేపలకోసం వల వేస్తే.. చిక్కిన కొండచిలువ

చేపల కోసం ఓ జాలరి వేసిన వలలో చేపలకు బదులు కొండచిలువ పడిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. రైల్వే బ్రిడ్జి పంప్ హౌస్ వద్ద బకింగ్ కెనాల్ కాలువలో గురువారం ఓ జాలరి చేపలు పట్టేందుకు కృష్ణా నదిలోకి వల వేయగా కొద్దిసేపటికి వల బరువుగా తగిలింది. దీంతో చేపలు బాగా పడ్డాయి అనుకుంటూ వలనిపైకి తీసి చూడగా అందులో ఉన్న కొండచిలువను చూసి ఒక్కసారిగా అవాకయ్యాడు. తాను ఎప్పుడూ ఇలా పాము రావడం చూడలేదని జాలరి చెప్పాడు.
News November 20, 2025
ANU: ‘మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే గుర్తింపు రద్దు’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాలోని కొన్ని కాలేజీలలో మంగళవారం నుంచి జరుగుతున్న PG, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారంపై గురువారం యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నమన్నారు. మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.


