News June 13, 2024
జగన్ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్

తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్ను నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేట ఎంపీగా ఓడిపోవడానికి గల కారణాలను జగన్కు వివరించారు. గెలవకపోయినప్పటికీ వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండాలని అనిల్కు జగన్ పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం అనిల్ కుమార్ జగన్తో భేటీ కావడం ఇదే మొదటిసారి.
Similar News
News November 23, 2025
నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.
News November 23, 2025
కావలి: రైలు కింద పడి యువకుడి దుర్మరణం

కావలి జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించగలరు.
News November 23, 2025
నెల్లూరు: కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

వరికుంటపాడు(M) తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించి శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.


