News June 21, 2024
జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం అమరావతిలో కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పెద్దిరెడ్డితో పాటు ఇతరులకు జగన్ దిశానిర్దేశం చేశారు.
Similar News
News September 12, 2024
చిత్తూరు: కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు
గ్రామ, వార్డు మహిళా పోలీసులకు కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇచ్చినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిలింగ్ కు 140 మంది హాజరయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను ఎస్పీ వారికి వివరించారు. వారి అభీష్టం మేరకు 49 మందికి పోస్టింగ్ కేటాయించారు. డిపిఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మోహన్ రావు పాల్గొన్నారు.
News September 11, 2024
వైద్యపరీక్షలకు హాజరైన ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలు
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ ఇవాళ వైద్యపరీక్షలకు హాజరైంది. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో అడ్మిట్ అయింది. ఆమెకు రెండు రోజుల పాటు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా.. తనపై అన్యాయంగా పెట్టిన కేసు కొట్టేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్‌ను ఎమ్మెల్యే ఆదిమూలం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
News September 11, 2024
చిత్తూరు: రూ.2 లక్షలకు లడ్డూ దక్కించుకున్న ఎమ్మెల్యే
చిత్తూరు పట్టణంలోని బజారు వీధిలో బంగారం దుకాణాల వ్యాపారులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా స్వామివారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలంపాట నిర్వహించారు. దీనిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రూ. 2 లక్షలకు పాడి దక్కించుకున్నారు. లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. మాజీ కార్పొరేటర్ వసంత కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.