News July 10, 2024
జగన్ను కలిసిన ప్రకాశం జిల్లా YCP కీలక నేతలు

గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కేపి.నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి బుధవారం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓటమితో ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ వారికి సూచించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని జగన్ చెప్పారన్నారు.
Similar News
News December 22, 2025
ప్రకాశం కలెక్టర్ మీకోసంకు 268 అర్జీలు.!

ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రకాశం కలెక్టర్ మీకోసంకు 268 అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ అర్జీలను సత్వరం పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అర్జీలు రాకుండా, అర్జీల పరిష్కారంపై ఎప్పటికప్పుడు ప్రజలకు పూర్తి సమాచారాన్ని అధికారులు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
News December 22, 2025
MLA ఉగ్రకు మున్ముందు ఉన్న సవాళ్లు ఇవే.!

ప్రకాశం జిల్లా TDP అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డికి మున్ముందు కొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. కనిగిరి MLAగా ఉగ్రకు ఉన్న సక్సెస్ రేట్తో జిల్లా పదవి వరించిందని టాక్. ఇక సవాళ్ల విషయానికి వస్తే.. ముందు జిల్లా, మండల, గ్రామ, బూత్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిఉంటుంది. జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయాల్సిఉంది. మొత్తంగా పంచాయతీ ఎన్నికలు ఉగ్రకు పెను సవాల్గా మారుతాయన్నది విశ్లేషకుల మాట.
News December 22, 2025
ఇవాళ ఒంగోలుకు ముగ్గురు మంత్రుల రాక

ఒంగోలుకు ఇవాళ ముగ్గురు మంత్రులు రానున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా ఒంగోలు పీటీసీ, డీటీసీలో కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రక్రియను వీరు ప్రారంభించి ప్రసంగిస్తారు.


