News February 3, 2025
జగన్‌పై హోం మంత్రి అనిత విమర్శలు

గీత కులాలకు మద్యం షాపులు కేటాయించడం నచ్చని జగన్ వైసీపీ న్యాయవాదులతో కేసులు వేయించారని హోంమంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. గీత కులాల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 335 మద్యం దుకాణాలను వారికి కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లిన జగన్‌ను ఎందుకు అడ్డుకుంటున్నావని ఆ కులాల వారు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
Similar News
News February 7, 2025
సిరిసిల్ల: పొక్సో కేసులో ఇద్దరు యువకులకు రిమాండ్

బాలికల అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట, నర్మాలకు చెందిన ఇద్దరు యువకులు చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాలో సర్కులేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువకులను అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
News February 7, 2025
రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిన్న రాత్రి మృతిచెందాడు. క్రిష్ణగిరి(M) తొగిడిచెడుకు చెందిన పెద్ద గిడ్డయ్య, ఆయన భార్య ఈనెల 4న పొలం పనులకు వెళ్తుండగా.. అదే మార్గాన కొత్తూరుకు చెందిన శివ తొగిడిచెడుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి బైక్‌లు ఢీకొన్నాయి. గిడ్డయ్యకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్థులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 7, 2025
చిత్తూరు: ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

బైరెడ్డిపల్లి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వి.కోట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మునెప్ప(69)అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. బైరెడ్డిపల్లి మండలం మిట్టపల్లికి చెందిన మునెప్ప వీకోట మండలం బండపల్లిలో ఉన్న కూతురు వద్దకు బయలుదేరాడు. ఆంజనేయస్వామి గుడికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు.