News August 10, 2024

జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి: స్పీకర్ అయ్యన్న

image

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని ఎమ్మెల్యే మాత్రమేనని అసెంబ్లీకి రావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. సమావేశాలలో అసెంబ్లీకి హాజరవ్వటం శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత అన్నారు.

Similar News

News September 11, 2024

విశాఖ-అరకులోయ బస్సుల పునరుద్ధరణ

image

భారీ వర్షాల కారణంగా విశాఖ నుంచి అరకులోయ రాకపోకలు సాగించే మూడు బస్సులను గత శనివారం నుంచి నాలుగు రోజుల పాటు రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో బుధవారం నుంచి ఈ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి మాడుగుల, పాడేరు వెళ్లాల్సిన సర్వీసులను చోడవరం వరకు మాత్రమే నడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా చోడవరం నుంచి మాడుగుల, పాడేరు రూట్లు బాగా పాడయ్యాయి.

News September 11, 2024

విశాఖలో రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ

image

సీతమ్మధార రైతు బజార్ సమీపంలో గల ఆక్సిజన్ టవర్స్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినాయకుని ప్రసాదమైన 50 కిలోల లడ్డూ వేలంపాటలో రూ.4.50 లక్షలు పలికింది. స్థానికురాలు హర్ష పల్లవి లడ్డూను వేలంలో దక్కించుకుని.. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆక్సిజన్ టవర్స్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 11, 2024

విశాఖ: ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

image

విశాఖ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా లబ్ధిదారులను తీసుకెళ్లి జియో ట్యాగింగ్ చేయించాలన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అన్ని విధాల సహకారం అందించాలన్నారు.