News October 5, 2024

జగన్ అన్ని హద్దులు దాటేశారు: పుల్లారావు

image

దేవుడి మీదే కాదు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై కూడా నమ్మకం, గౌరవం లేని రీతిలో జగన్ ప్రవర్తిస్తున్న తీరు విచిత్రంగా ఉందని MLA పుల్లారావు తప్పుబట్టారు. చిలకలూరిపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ వివాదంలో ఇప్పటికే జగన్ అన్ని హద్దులు దాటేశారన్నారు. చివరకు దేశాన్నే ప్రశ్నించే దుస్సాహసం చేశారన్నారు. రాష్ట్రం, దేశం న్యాయ వ్యవస్థలపై జగన్‌కు నమ్మకం లేని వ్యక్తి ఇక్కడ ఎలా ఉంటారని ప్రశ్నించారు.

Similar News

News November 11, 2024

గుంటూరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?

image

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి గుంటూరు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

News November 11, 2024

ప్రత్తిపాడు: జూద శిబిరంపై పోలీసుల దాడి

image

ప్రత్తిపాడులోని ఓ పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. CI శ్రీనివాసరావు వివరాల మేరకు.. రాబడిన సమాచారం మేరకు పేకాట స్థావరాలపై దాడి చేసి 38మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.96,300 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

News November 11, 2024

ANU దూరవిద్య MBA, MCA ఎంట్రన్స్ ఫలితాలు విడుదల

image

ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామని అన్నారు.