News January 30, 2025
జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: కాటసాని

గత ప్రభుత్వ హయాంలో తమ అధినేత వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని YCP నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా.. ప్రజలు తమపై విశ్వసనీయత కోల్పోకూడదని ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోను జగన్ అమలు చేశారన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న CBN.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిసే ఎలా హామీలు ఇచ్చారని ప్రశ్నించారు.
Similar News
News December 10, 2025
కామారెడ్డి జిల్లాలో దారుణ హత్య

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాంరెడ్డిపల్లికి చెందిన కూకట్ల సత్తయ్య(55)ను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 10, 2025
సంగారెడ్డి: పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ఈనెల 11వ తేదీన ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్నికల విధులకు వెళుతున్న పోలీసు అధికారులతో బుధవారం ఉదయం సమావేశం నిర్వహించారు. పోలింగ్ కౌంటర్ ముగిసే వరకు వేటి వ్యక్తులు లోపలికి పంపించవద్దని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
News December 10, 2025
రాంబిల్లిలో మిస్సైన టెన్త్ విద్యార్థుల ఆచూకీ లభ్యం

రాంబిల్లి(M) పంచదార్ల బీసీటీ స్కూల్ నుంచి మంగళవారం అదృశ్యమైన ఆరుగురు 10వ తరగతి విద్యార్థుల ఆచూకీ లభించింది. వారి కోసం జిల్లాలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించారు. చివరకు అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మిస్సింగ్ స్టోరీ సుఖాంతమైంది.


