News June 27, 2024

జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదు: ఆనం

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే గెలిచారని ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆనం నివాసంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష నేత హోదా రాదన్నారు.

Similar News

News January 19, 2025

ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న ప్రముఖులు వీరే 

image

సూళ్లూరుపేటలో ఆదివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు నేడు సూళ్లూరుపేటకు రానున్నారు. వారిలో నటి, యాంకర్ అనసూయ, అషు రెడ్డి, యాంకర్ రేణు, సింగర్ గాయత్రి, రఘురామ్, కొరియోగ్రాఫర్ సత్య, చైల్డ్ సింగర్ సాయి వాగ్ దేవి, మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ తదితరులు ఉన్నారు. 

News January 19, 2025

HYD ఓయో రూమ్‌లలో ఉంటూ గంజాయి వ్యాపారం

image

హైదరాబాదు ధూల్‌పేట జాలీ హనుమాన్ దేవాలయం వద్ద ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. వారు మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా(18), నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు(25) ఓయో రూమ్‌లలో అద్దెకు ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని వారు తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి వారిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 3.625 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News January 19, 2025

నెల్లూరు: పెరుగుతున్న నిమ్మ ధరలు.. రైతుల్లో ఆనందం

image

రెండు రోజుల నుంచి నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. ఇటీవల చలి ప్రభావం ఎక్కువ ఉండడంతో ధరలు ఆశించినంతగా లేక రైతులు ఆందోళన చెందారు. గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి రూ. 35 వరకు పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన నిమ్మకాయలు రూ. 45 పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. 50 కేజీల లూజు బస్తా రూ. 2,400 నుంచి 3,300 వరకు అమ్ముతున్నారు. నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.