News August 20, 2024

జగన్ కేసులపై హరిరామజోగయ్య పిల్.. హైకోర్ట్ విచారణ

image

మాజీ సీఎం జగన్‌పై ఉన్న కేసుల విచారణ వేగంగా చేపట్టాలంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వేసిన పిల్‌పై హైకోర్ట్ ఈరోజు విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ జరిగింది. తిరిగి పిటిషన్లపై విచారణను హైకోర్ట్ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.

Similar News

News November 24, 2025

భీమవరం: మానసిక రోగుల గుర్తింపుపై పోస్టర్‌ ఆవిష్కరణ

image

మానసిక రోగుల గుర్తింపు, చికిత్స, పునరావాసం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మనోబంధు ఫౌండేషన్ రూపొందించిన పోస్టర్‌ను ఎస్పీ నయీం అస్మి ఆవిష్కరించారు. సోమవారం ప.గో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సమాజంలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో వీరి వల్ల నేరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవడం అభినందనీయమన్నారు.

News November 24, 2025

దివ్యాంగురాలి దగ్గరకు వెళ్లి అర్జీ తీసుకున్న ప.గో కలెక్టర్

image

అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కాగా, ఓ దివ్యాంగురాలు అర్జీ ఇచ్చేందుకు రాగా.. కలెక్టర్‌ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

News November 24, 2025

తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

image

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.