News March 7, 2025
‘జగన్ చంచలగూడకి ఎక్కువ.. అండమాన్‌కి తక్కువ’

YCP అధినేత జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలు కుళాయిల వద్ద మహిళలు మాట్లాడేలా ఉన్నాయని విమర్శించారు. కార్పొరేటర్‌కు తక్కువ అనడం చూస్తుంటే జగన్ రెడ్డికి మతిభ్రమించినట్లు ఉందని మండిపడ్డారు. జగన్ చంచలగూడకి ఎక్కువ..అండమాన్‌కి తక్కువ అని ఆమె ఎద్దేవా చేశారు.
Similar News
News October 24, 2025
ప్రపంచబ్యాంకు నుంచి అమరావతికి మరో ₹1,750 కోట్లు!

AP: అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు రెండో విడతగా ₹1,750 కోట్లు ఇవ్వనుంది. డిసెంబర్ నాటికి ఈ ఫండ్స్ వచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ తెలిపారు. ‘తొలి విడతలో WB విడుదల చేసిన ₹1,800 కోట్లలో 50% ఖర్చు చేశాం. ఇందులో 75% పూర్తయ్యాక రెండో విడత కోసం దరఖాస్తు చేస్తాం’ అని చెప్పారు. అమరావతి ప్రాజెక్టులకు ₹13,600 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని గతంలో వరల్డ్ బ్యాంక్, ADB ప్రకటించాయి.
News October 24, 2025
గుంటూరు డీఈవోపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం

గుంటూరు జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో తాజాగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను ముద్రించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరుకు బదులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేరును ముద్రించారు. దీంతో డీఈవో రేణుక తీరుపై ఎమ్మెల్సీ ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 24, 2025
ఉమ్మడి గుంటూరుకు భారీ వర్ష సూచన

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం వరకు అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని, సోమ, మంగళవారల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు గుంటూరు, బాపట్ల, పల్నాడు, జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఓ ప్రకటన విడుదల చేసింది.


