News September 26, 2024
జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలి: పురందీశ్వరి

YS జగన్ తిరుమల పర్యటనపై BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ‘28న తిరుమలకు వెళ్తున్న జగన్ TTD అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. జగన్ అన్య మతస్తులు కావడంతో (జీవో ఎంఎస్ నం.311, రెవిన్యూ, ఎండోమెంట్స్ రూల్ నం.16) ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News December 4, 2025
ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: కందుల

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
News December 4, 2025
కోరుకొండలో గంజాయి ముఠా గుట్టురట్టు

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను కోరుకొండ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సీఐ సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురం-కనుపూరు రోడ్డులో గంజాయి చేతులు మారుతుండగా దాడి చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా పట్టుబడిన ఆరుగురిని అరెస్టు చేశారు. స్విఫ్ట్ కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
News December 4, 2025
ఇన్స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ఇన్స్ట్రక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. అనపర్తి, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, సీతానగరం, రాజానగరం, కడియం పరిధిలోని పాఠశాలల్లో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.


