News August 11, 2024

జగన్ నాకు రాజకీయ విరోధి కాదు.. ప్రత్యర్థి: RRR

image

ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జగన్‌ నాకు విరోధి కాదు.. ప్రత్యర్థి మాత్రమే. జగన్‌తో పోరాటం.. పోరాటమే. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో కూటమి గెలుపులో, జగన్ ఓటమిలో రచ్చబండ కీలక పాత్ర పోషించింది’ అని అన్నారు.

Similar News

News September 10, 2024

రేపు ప.గో జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

ప.గో జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఆకివీడు పట్టణంలోని ఉప్పుటేరు ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తారని కూటమి నాయకులు తెలిపారు.

News September 10, 2024

ప.గో: కారును అడ్డగించి నగదు, బంగారం దోపిడీ

image

దారి కాచి 3 కాసుల బంగారం, రూ.50 వేల నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఘటనపై తణుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన తోట సత్తిపండు తన ముగ్గురి స్నేహితులతో కలిసి కారులో రాజమండ్రి నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో డీమార్ట్ వద్ద ఇద్దరు దుండగులు సత్తిపండు కారును అడ్డగించారు. అతడిని బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు.

News September 10, 2024

పది, ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్‌లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. అడ్మిషన్స్‌ కోసం ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 15 వరకు గడువు పొడిగించారన్నారు. రూ.200 ఫైన్‌తో 25 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.