News February 19, 2025

జగన్ నాసిరకం మద్యం అమ్మించాడు: మంత్రి స్వామి

image

జగన్ జే ట్యాక్స్ కోసం నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీశాడని మంత్రి స్వామి అన్నారు. నాటు సారా నిర్మూలనపై బుధవారం ఒంగోలులో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, నాటుసారా, మద్యం విచ్చలవిడిగా విక్రయించారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాల్లో సైతం గంజాయి, డ్రగ్స్ దోరేకవన్నారు. కూటమి పాలనలో గంజాయి, డ్రగ్స్‌ని అరికట్టేందుకు ఈగల్ వ్యవస్థని తెచ్చామన్నారు.

Similar News

News September 18, 2025

ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్‌పై లుక్కేయండి!

image

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.

News September 18, 2025

ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News September 17, 2025

ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

image

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.