News July 3, 2024
జగన్ నెల్లూరు పర్యటన షెడ్యూల్ ఇదే..!

నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన షెడ్యూల్‌ను మాజీ మంత్రి కాకాణి వెల్లడించారు. ఉదయం 9.40 గంటలకు జగన్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరుతారు. 10.30 గంటలకు నెల్లూరు పోలీసు పరేడ్ మైదానానికి చేరుకుంటారు. రోడ్డు మార్గాన జైలుకు వెళ్లి.. తిరిగి 12 గంటలకు పోలీసు పరేడ్ మైదానానికి చేరుకుని తాడేపల్లికి వెళ్తారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు ‘నేర‘జాణలు వీళ్లు.!

నెల్లూరులో ‘నేర‘జాణల హవా ఎక్కువైంది. మొన్నటి వరకు నిడిగుంట అరుణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా పెంచలయ్య హత్యతో అరవ కామాక్షి వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులతో గ్యాంగ్ నడిపిస్తూ గంజాయి వ్యాపారం చేస్తోంది. తనకు అడ్డు వచ్చి వారిని ఇదే గ్యాంగ్‌తో బెదిరిస్తోంది. ఈక్రమంలోనే పెంచలయ్యను కామాక్షి హత్య చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి లేడీ డాన్లను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
News December 2, 2025
నేడు నెల్లూరు జిల్లా బంద్

వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు జిల్లా బంద్ జరగనుంది. పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను నిషేధించాలని, గంజాయి మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని, పెంచలయ్య హత్యకు కారకులైన వారిని శిక్షించాలని జరుగుతున్న బంద్‌కి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న నిందితురాలు కామాక్షికి చెందిన ఇళ్లను స్థానికులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
News December 2, 2025
నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.


