News April 29, 2024
జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం?

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నిన్న సీఎం ప్రచారం జరిగింది. ఈక్రమంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. త్రిభువని సెంటర్లో ప్రసంగం అనంతరం జగన్ విశ్వోదయ కాలేజీ మైదానంలోని హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో డక్కిలి మండలం నాగోలు పంచాయతీ పెద్దయాచ సముద్రానికి చెందిన మాజీ వాలంటీర్ బారికేడ్లు దూకి హెలికాప్టర్ వద్దకు పరుగులు తీశాడు. భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News October 21, 2025
పురమిత్ర యాప్తో ఆన్లైన్ సేవలు సులభతరం

పురమిత్ర యాప్ ద్వారా మున్సిపల్ ఆన్లైన్ సేవలు సులభతరం అవుతాయని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్
మంగళవారం తెలిపారు. పురమిత్ర ఫోన్ యాప్ ద్వారా వివిధ రకాల టాక్స్లు సులభంగా చెల్లించవచ్చన్నారు. https://play.google.com/store/apps/details?id=com.dreamstep.apcmmscitizen ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దీని ద్వారా ఫిర్యాదులు కూడా చేయవచ్చని పేర్కొన్నారు.
News October 21, 2025
రేపు పాఠశాలలకు సెలవు: నెల్లూరు DEO

నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రాజా బాలాజీ రావు తెలిపారు. వాతావరణ శాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయా మండలాల విద్యాధికారులు పాఠశాలలకు సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News October 21, 2025
కావలిలో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

కావలిలోని బుడంగుంట రైల్వే గేటు సమీపంలో మంగళవారం రైలు కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రైలు పట్టాలపై మహిళ మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, మృతురాలు పూర్తి వివరాలు తెలియాల్సింది.