News April 25, 2024

జగన్ పాలనలో వెనుకబడిన ఆంద్రప్రదేశ్: రాజ్ నాథ్ సింగ్

image

సీఎం జగన్ పాలనలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియాతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో వెనుకబడిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బుధవారం రాత్రి అనకాపల్లిలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆధ్వర్యంలో రోడ్ షో ర్యాలీగా నిర్వహించారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రాలో 3,600 కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించారన్నారు. జగన్ వైఫల్యం వలన ఏపీ వెనుకబడి పోయిందన్నారు.

Similar News

News December 15, 2025

విశాఖ: టెట్ పరీక్షకు 10 మంది గైర్హాజరు

image

విశాఖలో సోమవారం రెండు కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 171 మంది అభ్యర్థులకు గానూ 161 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 10 మంది గైర్హాజరు అయ్యారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక పరీక్ష కేంద్రంను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.

News December 15, 2025

విశాఖలో పీజీఆర్ఎస్‌కు 299 వినతులు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 299 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 132 ఉండ‌గా, జీవీఎంసీ 76, పోలీస్ విభాగానికి సంబంధించిన‌వి 24, ఇత‌ర విభాగాల‌కు చెందిన‌వి 67 ఉన్నాయి.

News December 15, 2025

విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

image

విశాఖలో డిసెంబర్ 21న పల్స్ పోలియో నిర్వహించనున్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఇప్పటికే సూచించారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ విషయన్ని గమనించాలని అధికారులు కోరారు.