News September 15, 2024

జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరదలు: సోమిరెడ్డి

image

నెల్లూరు మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేరు ఆధునికీకరణకు 2019లో టీడీపీ టెండర్ పిలిస్తే, వైసీపీ విస్మరించిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వరద బాధితులను పరామర్శించేందుకు సైతం జగన్ ఆర్భాటాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎం జగన్‌కు క్యూసెక్, టీఎంసీ, అవుట్ ఫ్లో అంటే అర్థాలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు.

Similar News

News October 13, 2024

నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

నెల్లూరు జిల్లాలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆనంద్ అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించార. ప్రజలు అత్యవసర సమయంలో 0861-2331261, 7995576699 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

News October 13, 2024

ఏ.ఎస్.పేటలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఏఎస్ పేట ఎమ్మార్వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ శ్రీరామకృష్ణ తెలిపారు. జిల్లాలో తుఫాన్ ప్రకటన నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయంలో 9177504901 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది అయినా ఈ నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.

News October 13, 2024

SVU : డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో డిగ్రీ (UG) B.A/B.COM/BSC/BCA/BBA/BA 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.