News November 12, 2024
జగన్ ప్రవర్తన సిగ్గుచేటు: ఆనం
వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఎందుకు రారని AP స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. 39.37 శాతం మంది ప్రజల మనోభావాలను ఆయన అవమానిస్తున్నారన్నారు. ప్రతి పక్షా హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సిగ్గుచేటన్నారు. జగన్ వెంట ఆ పార్టీ MLAలు సైతం నడవడం బాధాకరమన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు.
Similar News
News December 2, 2024
రేపు సూళ్లూరుపేటకు జిల్లా కలెక్టర్ రాక
ఉమ్మడి నెల్లూరు జిల్లా,సూళ్లూరుపేటలో రేపు ఉదయం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హాజరై ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News December 1, 2024
కొండాపురం: హత్య చేసిన నిందితుడు అరెస్ట్
కొండాపురం మండలం గానుగపెంటలో బంకా తిరుపాలు అనే మేకల కాపరిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ శ్రీధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. గానుగపెంటలో బుధవారం బాంకా తిరుపాలు హత్యకు గురయ్యాడు. పశువులు కాస్తున్న మాల్యాద్రి(మల్లి) ఈ హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. తిరుపాలుకు చెందిన మేకలను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ఆశతోనే ఈ హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
News December 1, 2024
నెల్లూరు జిల్లాలో పలు బస్సులు రద్దు
నెల్లూరు జిల్లాలో భారీవర్షాల నేపథ్యంలో పలు బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు రీజియన్ పరిధిలో ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు నుంచి చెన్నైకు ప్రతి రోజూ 18 బస్సులు నడుస్తుండగా వాటిని రద్దు చేశామన్నారు. మరోవైపు కావలి నుంచి తుమ్ములపెంట దారిలో కాలువకు గండి పడటంతో ఆ దారిలో వెళ్లే బస్సులను సైతం రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.